Tuesday, April 30, 2024

ఎస్కార్టు సిబ్బందిపై దాడి చేసి ఖైదీ పరార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో విధుల్లో ఉన్న ఎస్కార్టు సిబ్బందిపై దాడి చేసి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్‌ను మక్లూర్ పోలీసులు ఓ దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టుకు ప్రసాద్‌కు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జైల్లో ఉండగా శనివారం అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి ఆయన దగ్గర ఉన్న షార్ట్‌వెపన్(తుపాకీ) లాక్కుని పారిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తుపాకీతో సహా నిందితుడు పరారవ్వడంతో సిపి కార్తికేయ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగతనం కేసులో నిందితునిగా ఉన్న ప్రసాద్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దింపారు. ఈక్రమంలో నిందితుని స్వగ్రామంలో మక్లూర్‌లో నిఘా అధికం చేశారు.

Prisoner Fled Attacked on Escort Personnel in Nizamabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News