Tuesday, May 21, 2024

భారత్ నుంచి అమెరికాకు చేరిన క్లోరోక్విన్ మాత్రలు

- Advertisement -
- Advertisement -

Chloroquine tablets

 

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు భారత్ నుంచి 35.82 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు ప్రత్యేక విమానం ద్వారా అమెరికా లోని నెవార్క్ విమానాశ్రయానికి శనివారం చేరుకున్నాయి. మలేరియా నివారణ కోసం ఈ హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు వాడుతుంటారు. దీని ఎగుమతిపై నిషేధం ఉంది. ఈ వారం మొదట్లో ట్రంప్ అభ్యర్థనపై వీటి ఎగుమతిపై పాక్షికంగా నిషేధం భారత ప్రభుత్వం ఎత్తివేసింది. మానవతా దృక్పథంతో అమెరికాతోపాటు మరి కొన్ని దేశాలకు వీటిని పంపాలని నిర్ణయించుకుంది. కరోనా వైరస్ చికిత్సలో క్లోరోక్విన్ కీలక పాత్ర వహిస్తోందని, ఫలితాలు ఆశాజనకంగా వస్తున్నాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించడంతో అమెరికా ప్రభుత్వం ఈమేరకు క్లోరోక్విన్ పై మొగ్గు చూపింది.

Chloroquine tablets reached the US
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News