Tuesday, April 30, 2024

లేడీ స్టార్స్ కాంబినేషన్‌లో మూవీ

- Advertisement -
- Advertisement -

Movie on Samantha and Nayanthara Combination

 

ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున సౌత్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్స్ సమంత, నయనతార సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు అదిరిపోయే కొత్త సినిమా గురించి చెప్పారు. వారిద్దరూ కలిసి నటిస్తున్న కొత్త సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ కలిసి చేస్తుంది తెలుగు సినిమా కాదు… అది ఒక తమిళ సినిమా. ఆ సినిమా పేరు ’కాతు వాకుల రెండు కాదల్’ అని ఖరారు చేశారు. ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఈ హీరోయిన్ల అభిమానులు ఎదురు చూస్తున్నారు. సమంత, నయనతారలను ఒకే స్క్రీన్ మీద చూస్తే నిజంగానే కన్నుల పండుగలా ఉంటుంది. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయట. ఇందులో హీరోగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.

సినిమాలో విజయ్ ఉన్నాడని తెలిసే సరికి సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇంకా నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మరో విశేషం ఏంటంటే.. నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నడుస్తుండటం ఇదే తొలిసారి. సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ముగ్గురు స్టార్లు కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమా వినోదభరితంగా సాగనుందట. నిజానికి ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కావాల్సి ఉంది. లాక్ డౌన్ వలన బ్రేక్ పడింది. తాజాగా ఆగస్ట్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News