Thursday, May 2, 2024

గుజరాత్‌లో కాంగ్రెస్‌కు మరో ఎంఎల్‌ఎ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Another Congress MLA resigns in Gujarat

 

గాంధీనగర్ : రాజ్యసభ ఎన్నికల ముందట కాంగ్రెస్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా శుక్రవారంనాడు పార్టీ సీనియర్ నేత, మోర్బీ ఎంఎల్‌ఎ బ్రిజేష్ మీర్జా రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. తొలుత మార్చిలో రాజ్యసభ ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఐదుగురు గుజరాత్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు రాజీనామా చేయగా తాజా ప్రకటన రాగానే మరో ఇద్దరు రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆక్షయ్ పటేల్, జితు చౌధరి గురువారం తనకు రాజీనామా పత్రాలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదీ వెల్లడించారు. కాగా గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈనెల 19న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 182 కాగా, అధికార పార్టీకి 103 మంది ఎంఎల్‌ఎలున్నారు. కాంగ్రెస్ బలం 73 నుంచి తాజా రాజీనామాలతో 65కి పడిపోయింది. దీంతో నాలుగు స్థానాల్లో కనీసం రెండు స్థానాలైనా గెలవాలి అనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నానికి అధికార బిజెపి గండికొట్టింది. తాజా పరిణామాలతో బిజెపి మూడు స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ముందస్తు ప్రణాళికలో భాగంగానే రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి ముగ్గురు అభ్యర్థులను నిలిపింది. ఇదిలావుండగా ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక బీజేపీ నేతల ఒత్తిడి ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News