Tuesday, April 30, 2024

ఈఎన్‌టి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు పాజిటివ్

- Advertisement -
- Advertisement -

Corona for ENT and Fever Hospital Superintendent

 

భయం నీడలో వైద్యం
సర్కార్ ఆసుపత్రులపై కరోనా పడగ
వైద్యసేవలందించేందుకు భయపడుతున్న సిబ్బంది
నిమ్స్,పేట్లబురుజు,ఉస్మానియా కళాశాల,ఏరియా ఆసుపత్రుల వదలని వైరస్
ఇప్పటివరకు 150మంది వైద్యసిబ్బంది,కుటుంబాలకు కరోనా లక్షణాలు

మన తెలంగాణ, హైదరాబాద్ : గ్రేటర్ నగరంలో కరోనా మహమ్మారి విజృంభణ చేస్తూ రోగులకు సేవలందించే వైద్యులపై దాడి చేస్తుంది. దీంతో కరోనా బాధితులకు సేవలు అందించాలంటే డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వైరస్ తమను హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు వందలాది పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సమయమంతా కరోనా రోగులతో గడపటంతో మహమ్మారి తమను పీడిస్తుందని ఆవేదన చెందుతున్నారు. తాజాగా ఈఎన్‌టి ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌లకు సోకడంతో మిగతా సిబ్బంది చికిత్స అందించేందుకు భయపడిపోతున్నారు. ఇప్పటికే పోలీసులు, జర్నలిస్టుల సోకి ప్రాణాలు బలిగొంది. వైద్యులను కూడా హరిస్తుందని హడలిపోతున్నారు. రెండు నెల క్రితం గాంధీ ఆసుపత్రిలో ఒక ప్రొఫెసర్, ఇద్దరు నర్సులు సోకడంతో వైద్యులు జాగ్రత్తలు తీసుకుని సేవలందించారు. అప్పటి నుంచి మళ్లీ వారి వైపు వైరస్ వెళ్లలేదు.

పదిరోజుల కితం ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన 23మంది విద్యార్దులకు సోకిగా, తరువాత నిమ్స్ ఆసుపత్రిపై పంజా విసిరి 26మంది డాక్టర్లు, 40 మంది నర్సులు, ల్యాబ్ సిబ్బందికి కలిసి 66మందిని కాటు వేసింది. నెలరోజుల్లో వైద్యులు వారి కుటుంబ సభ్యులకు కలిసి 150మంది పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మూడు రోజుల కితం పాతబస్తీ పేట్ల బురుజు ఆసుపత్రిలో విధులు నిర్వహించే 30మంది సిబ్బందికి, కోండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 14మందికి సోకింది. ప్రధాన ఆసుపత్రులకు చెందిన ఉన్నతాధికారులకు సోకడంతో సిబ్బంది సెలవులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మూడు నెల నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కరోనా రోగుల సేవ పరమావధిగా భావిస్తూ వైద్య అందించామని, తమకు సోకితే తమ కుటుంబాల పరిస్దితి ఏమిటని ఉన్నతాధికారులను నిలదీస్తున్నట్లు తెలుస్తుంది.

మే 15 తరువాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్దాన్ రాష్ట్రాలకు వలస వెళ్లి కూలీలు తిరిగి రాష్ట్రానికి రావడంతో కరోనా రెక్కలు కట్టుకుని వీరవిహారం చేస్తుంది. రోజుకు సగటను 100 నుంచి 180 కేసులు నమోదైతూ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది.అదే స్దాయిలో మరణాలు పెరుగుతున్నాయి. వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంపై గ్రేటర్ వాసులు రానున్న రోజుల్లో వైరస్ ఉద్దృతమైతుందని, మరోసారి లాక్‌డౌన్ విధిస్తే కరోనాకు కట్టడి చేయవచ్చని పేర్కొంటున్నారు. మూడో విడుత లాక్‌డౌన్‌లో మద్యం దుకాణాలు, రిజిస్ట్రేషన్, ఆర్టీఏ కార్యాలయాల సేవలు ప్రారంభం కావడంతో ప్రజలు రోడ్డపైకి వచ్చి ఇష్టానుసారంగా తిరగడంతో కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో అదుపులో ఉన్న కరోనా సడలిపుంతో విజృంభణ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందంటున్నారు.

నగరంలో ఐదు ఆసుపత్రులో మాత్రం వైద్యం చికిత్సలు చేస్తున్నారని, వీటిలో సిబ్బంది సరిపడ లేకపోవడంతో ఉన్నవారు అదనపు గంటలు పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలి టిమ్స్‌లో తగిన సిబ్బందిని నియమించి త్వరగా వైద్య సేవలు ప్రారంభిస్తే మిగతా ఆసుపత్రులోని వైద్యులు, సిబ్బంది జాగ్రత్తలు పాటించుకుంటూ రోగులకు సకాలంలో వైద్యం అందిస్తారని వైద్యులు చెబుతున్నారు. రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న వైద్య సిబ్బంది అదే స్దాయిలో ఉండటంతో చివరకు వైద్యులను కరోనా వదలడం లేదని పేర్కొంటున్నారు. భవిష్యత్తు కాలంలో మహమ్మారి ఎంతమంది బలి తీసుకుంటుందోనని వైద్య సిబ్బంది ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News