Sunday, May 5, 2024

అమెరికాలో మళ్లీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో గత కొన్ని వారాలుగా కరోనా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా మళ్లీ మంగళవారం కొత్తగా 34,700 కేసులు బయటపడడంతో అమెరికాను కరోనా వీడడం లేదనిపిస్తోంది. జాన్స్‌హాప్‌కిన్స్ యూనివర్శిటీ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. గత ఏప్రిల్ 9,24 తేదీల్లో రికార్డు స్థాయిలో 36,400 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ మంగళవారమే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఆరు వారాలుగా ఎలాంటి కేసులు లేకున్నా గత వారం రోజులుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గతంలో న్యూయార్క్, న్యూజెర్సీల్లో అత్యధికంగా కేసులు నమోదై హాట్‌ష్పాట్‌లుగా పరిగణించేవారు. ఇప్పుడు ఆక్కడ నిదానంగా తగ్గుతున్నాయి. అరిజోనా, కాలిఫోర్నియా, మిసిసిపి, నెవడా, టెక్సాస్ తదితర అనేక రాష్ట్రాల్లో మంగళవారం కరోనా కేసులు ఎక్కువగా కనిపించాయి.

34700 New Corona Cases Reported in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News