Tuesday, April 30, 2024

అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు…

- Advertisement -
- Advertisement -

International flights canceled till july 25

 

హైదరాబాద్ : కోవిడ్-19 కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. తాజాగా రైల్వే బోర్డ్ రెగ్యులర్ రైళ్ల రాకపోకలను ఆగస్ట్ 12 వరకు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇండియా​ నుంచి కూడా విదేశాలకు విమాన సర్వీసులు నడపబోమని స్పస్టం చేసింది. వీటిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ప‌ర్మిష‌న్ పొందిన గూడ్స్ రవాణా ఫ్లైట్స్ కు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు వివ‌రించింది. తదుపరి నిర్ణయం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమ‌ల‌వుతాయ‌ని వెల్ల‌డించింది. కరోనావైరస్ సంక్షోభం మధ్య దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి రావడంతో మార్చి 25 న భారతదేశం అన్ని విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించ‌డంపై అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. స‌డ‌లింపుల్లో భాగంగా మే 25 నుండి దేశీయ విమానాలను అనుమతించిన విషయం తెలిసిందే.

https://twitter.com/DGCAIndia/status/1276471428016009216?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1276471428016009216%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.businessinsider.in%2Findia%2Fnews%2Fall-international-flight-to-india-will-remain-suspended-till-15-july-says-ministry-of-civil-aviation%2Farticleshow%2F76644584.cms

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News