Tuesday, April 30, 2024

తెలంగాణలో రానున్న మూడురోజుల్లో వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Rains in next 5 days in Telangana

హైదరాబాద్‌ః దక్షిణకోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అరేబియా సముద్రం నుంచి కర్ణాటక మీదుగా తేమగాలులు వీస్తున్నాయి. రాయలసీమ, కోస్తాలో చురుగ్గా రుతుపవనాలు కదులుతుడడంతో మంగళవారం ఎపిలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో మోస్తరు వానలు కురువనున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, రాణిగంజ్, ట్యాంక్‌బండ్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, అసిఫ్‌నగర్, లక్డీకాపూల్, మెహదీపట్నంలో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం కూడా ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Rains in Telangana for next three days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News