Tuesday, April 30, 2024

భారత్ లో పెట్టుబడులు పెట్టాలి: మోడీ

- Advertisement -
- Advertisement -

India welcome investments

 

ఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాల ప్రతినిధులకు సూచించారు.  ఇండియన్ గ్లోబల్ వీక్-2020లో 30 దేశాల ప్రతినిధులతో మోడీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడిందన్నారు. కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుంటుందన్నారు. కరోనాకు అతి త్వరలో వ్యాక్సిన్ రావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నామన్నారు. ఇండియాలో ఫార్మా పరిశ్రమలు భారత్‌కే కాదు ప్రపంచానికే ఉపయోగపడుతున్నాయన్నారు. ఆరోగ్య భారత్‌తో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ముందున్న లక్ష్యమన్నారు. గడిచిన ఆరేళ్లలో ట్యాక్స్ సంస్కరణలు అమలు చేశామని, నైపుణ్యం ఉన్న యువతకు భారత్‌లో కొదువలేదన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు ఉచిత గ్యాస్, బియ్యం అందించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News