- Advertisement -
హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 కకి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఒకట్రెండు చోట్ల మంగళ, బుధవారాలు చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటనలో తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, న్మిల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ పట్టణ, గ్రామీణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది.
- Advertisement -