Sunday, May 5, 2024

మెక్సికోలో కాల్పులు… 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

11 killed in bar shooting in Mexico

 

మెక్సికో: మెక్సికో సిటీలోని గ్వానాజువాటోలో మంగళవారం కాల్పుల కలకలం సృష్టించింది. జరెల్ డెల్ పాగ్రెస్ నగరంలో ఓ బార్ లోకి ముఠా చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 11 మంది చనిపోయారు. మృతులలో ఎక్కువగా డాన్స్ ర్లు ఉన్నట్టు గుర్తించారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్టు గుర్తించారు. డ్రగ్స్ ముఠాలే ఈ దారుణానికి పాల్పడి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్వానాజువాటోలోని గన్ కల్చర్ ఎక్కువగా ఉండడంతో మాదక ద్రవ్యాల ముఠాలు చెలరేగిపోయి కాల్పులు జరుపుతున్నాయి.  గ్యాంగ్‌స్టర్ జోన్ అంటోనియో యెపెజ్ ఓర్టిజ్ అరెస్టు చేశాక నేరాలు తగ్గుతాయని పోలీసులు భావించారు. కానీ నేరాలలో మాత్రం మార్పులేదని స్థానికులు వాపోయారు. జులైలో 433 మంది చనిపోగా ఆగస్టులో 339, సెప్టెంబర్‌లో మళ్లీ పెరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News