Tuesday, May 21, 2024

మిగ్29కె పైలట్ మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: మిగ్29కె శిక్షణ విమానం కూలిపోయిన ఘటనలో గల్లంతైన పైలట్ కమాండర్ నిషాంత్‌సింగ్ మృతదేహం లభ్యమైంది. 12 రోజుల క్రితం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ పైలట్ బతికి బయటపడగా, మరొకరు గల్లంతైన విషయం తెలిసిందే. నిషాంత్ మృతదేహాన్ని గోవా తీరానికి 30 మైళ్ల దూరంలో నావికా దళాలు కనుగొన్నాయి. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన నావికాదళాలు సముద్రంలో 70 మీటర్ల లోతులో నిషాంత్ శవాన్ని గుర్తించి వెలికితీశారు. నవంబర్ 26న దుర్ఘటన జరగగా, 29న మిగ్29కెకు చెందిన కొన్ని శకలాలను కనుగొన్నారు. నిశాంత్ ఆచూకీ తెలయకపోవడంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. నిషాంత్ మృతదేహం లభ్యమైన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. నిర్ధారణ కోసం డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News