Sunday, April 28, 2024

మొక్కలు నాటడం జీవనవిధానం కావాలి

- Advertisement -
- Advertisement -

Sanjay Dutt who planted plants in Green India Challenge

 

గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటిన సంజయ్‌దత్

మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణం పట్ల అవగాహన, ప్రకృతిపట్ల ప్రేమ అందరిలో పెరగాలని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పుట్టిన రోజు సందర్భంగా,గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సోమవారం సంజయ్‌దత్ మొక్కలు నాటారు. హైదరాబాద్ శిల్పారామంలో ఎంపి సంతోష్‌కుమార్‌తో కలిసి సంజయ్‌దత్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని పెంచడం అందరి జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. జోగినపల్లి సంతోష్‌కుమార్ స్ఫూర్తితో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను ముంబాయిలోని నిర్వహించనున్నట్లు సంజయ్ దత్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న సవాళ్లలో పర్యావరణ రక్షణే అతి పెద్దదని ఆయన చెప్పారు. ఈ ముప్పు నుంచి బయటపడాలంటే ఉన్న అడవులను కాపాడుకోవడంతో పాటు కొత్తగా పెద్ద ఎత్తున పచ్చదనం పెంచాల్సిన వసరం ఉందని సంజయ్ దత్ చెప్పారు.

నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత మొక్కలు నాటిన వారు తీసుకోవాలని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ సంస్కృతి విస్తృతంగా మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. నాఅభిమానులు,స్నేహితులు గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని సంజయ్‌దత్ కోరారు. సంతోష్‌కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ తానుగతంలోనే విన్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా పచ్చదనం పెంచేందుకు సంతోష్‌కుమార్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా తనపుట్టిన రోజు సందర్భంగా గ్రీన్‌ఇండియా కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ నటుడు సంజయ్‌దత్ హైదరాబాద్‌కు వచ్చి మొక్కలు నాటడం పట్ల సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి మరో ముగ్గిరికి సవాల్ విసరుతూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందకు తీసుకువెళ్లాలని ఆయన పిలపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News