Saturday, April 27, 2024

కాశ్మీర్‌కు రెండోరోజూ.. రాకపోకలు బంద్

- Advertisement -
- Advertisement -
Heavy Snowfall in Kashmir 2021 
మంచు వల్ల జాతీయ రహదారి మూసివేత

శ్రీనగర్: సోమవారం నుంచి రెండు రోజులుగా కాశ్మీర్‌తో దేశంలోని మిగతా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాశ్మీర్‌ను జమ్మూతో కలిపే జాతీయ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 4500 వాహనాలు నిలిచిపోయాయని, వాటిలో ఎక్కు వ భాగం కాశ్మీర్‌వాసులకు నిత్యావసరాలను తీసుకెళ్లే ట్రక్కులేనని అధికారులు తెలిపారు. 250 కిలోమీటర్ల పొడవైన రోడ్డు మార్గాన్ని మూసివేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మొగల్ రోడ్డు మార్గంలో రాకపోకల్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని కొన్ని చోట్ల 3,4 అడుగులమేర మంచు పేరుకుపోయింది. శ్రీనగర్‌లో మైనస్ 0.9 డిగ్రీల సెల్సియస్, మంగళవారం మైనస్ 0.8 డిగ్రీలు నమోదైంది. శ్రీనగర్‌కు విమానాల రాకపోకల్ని నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News