Sunday, April 28, 2024

లంచం కేసులో చైనా బ్యాంకర్‌కు ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

Ex-Banker In China Sentenced To Death

బీజింగ్ : చైనాకు చెందిన హౌరాంగ్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మాజీ చైర్మన్ లాయ్ జియోమిన్‌కు స్థానిక కోర్టు ఉరిశిక్ష విధించింది. చైనాలో అతిపెద్ద అవినీతి కేసులో మంగళవారం తియాంజిన్ సిటీ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. 2008 నుంచి 2018 మధ్య కాలంలో జియోమిన్ దాదాపు 1.788 బిలియన్ యువాన్‌లు (రూ.2,023 కోట్లు) లంచం తీసుకున్నట్టు రుజువైంది. ఈ కాలంలో అతను సీనియర్ బ్యాంకింగ్ రెగ్యులేటర్ కూడా ఉన్నారని కోర్టు వర్గాలు తెలిపాయి. అతను బిగామీ ఆరోపణల్లోనూ నిందితుడిగా తేలాడు. 2018లో అధికారిక కమ్యూనిస్టు పార్టీ లాయ్‌ను బహిష్కరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News