Saturday, November 2, 2024

ఒడిశాలో గ్యాస్ లీక్: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

4 dead in Gas Leak In Odisha Steel Plant

భువనేశ్వర్: ఒడిశాలోని రూర్కెలా స్టీల్ ఫ్యాక్టరీలో భుధవారం గ్యాస్ లీక్ అయింది. టాక్సిక్ గ్యాస్ లీక్ కావడంతో నలుగురు మృతి చెందగా ఆరుగురు అపస్మారక స్థితిలో ఉన్నారు. పది మంది కార్మికులు పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్‌ఎస్‌పి వెల్లడించింది. లీకేజీలో కార్బన్ మోనాక్సైడ్ విడుదల కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆరుగురిని ఐసియులో పెట్టారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు పట్ల సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశించారు. దీంతో బాధితులు పరిహారం ఇప్పించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News