Wednesday, May 8, 2024

ఆటోను వెంబడించిన చిరుతపులి పిల్లలు

- Advertisement -
- Advertisement -

leopard cubs chasesed auto in medak districts

హైదరాబాద్: మెదక్ జిల్లా చిన్న శంకరం పేట మండలం కామారం గ్రామ శివారులో చిరుత పిల్లలు కలకలం రేపాయి. కామారం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి మామిడి తోట వద్ద మూడు చిరుత పులి పిల్లలు రోడ్డుపై బైఠాయించినట్టు గ్రామస్తులు గుర్తించారు. ఈక్రమంలోనే అటుగా వచ్చిన ఆటో వెంబడి పరిగెత్తడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణీకులు అటవీ శాఖ అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు.కాగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పెద్దగా స్పందించలేదని కామారం గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ఇక కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారంతో తీవ్ర భయాందోళనలో ఉన్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే గ్రామంలో టపాకాయలు కాల్చి మంటలతో చిరుతలను తరిమి వేశామని గ్రామస్తులు అంటున్నారు. చిరుత పులుల బాద నుండి తమను కాపాడాలని కామారం గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు. ఇదిలావుండగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా తెలంగాణలో వరుసగా పులి, చిరుత పులులు టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. పులులు, చిరుతల సంచారంతో జనాల కంటిమీదకునుకులేకుండాపోతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాలాలో పులుల సంచారం, ఆపై పశువులపై దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News