Tuesday, April 30, 2024

‘వైల్డ్ డాగ్’ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఫిల్మ్‌మేకర్స్ తెలియజేశారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ.. “హైదరాబాద్‌లో జరిగిన బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ బ్లాస్ట్‌లో బాంబులు పెట్టిన వ్యక్తులను పట్టుకోవడమే లక్షంగా ఈ సినిమా కొనసాగుతుంది. ఈ చిత్రంలో నేను ఎన్‌ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తా. ముందుగా ఈ చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ సంక్రాంతికి ‘క్రాక్’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. అలాగే ఫిబ్రవరిలో ‘ఉప్పెన’ రిలీజై పెద్ద హిట్ కావడమే కాకుండా భారీ వసూళ్లను సాధించింది. అప్పుడే మేం కూడా ఓటిటి కాదని.. థియేటర్లలో రిలీజ్ చేయడానికే నిర్ణయించాము. ఏప్రిల్ 2న ‘వైల్డ్ డాగ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది” అని తెలిపారు. చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఈ సినిమాను ముందుగా ఓటీటీకి అమ్మినా, థియేటర్‌లో విడుదల చేసుకునే అవకాశం మాకు ఇచ్చారు. సినిమా థియేటర్‌లో విడుదలైన 30, 40 రోజుల తర్వాత ఓటీటీలో విడుదలవుతుంది”అని తెలిపారు. ఈ సమావేశంలో దర్శకుడు అహిషోర్ సాల్మన్, నటి సయామీ ఖేర్‌తో పాటు చిత్ర బృందం పాల్గొంది.

‘Wild Dog’ Movie to Release on April 2nd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News