Tuesday, May 14, 2024

బ్లడ్ క్యాన్సర్ రోగులకు ‘టి’ కణ రక్షణ

- Advertisement -
- Advertisement -

‘T’ cell protection for blood cancer patients

అమెరికా శాస్త్రవేత్తల వెల్లడి

ఫిలడెల్ఫియా : కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి యాంటీబాడీలే కాదు రోగనిరోధక వ్యవస్థ లోని టి కణాలు కూడా కీలక పాత్ర వహిస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. బ్లడ్ క్యాన్సర్ రోగుల్లో ఆ వ్యాధికి తీసుకుంటున్న చికిత్స కారణంగా యాంటీబాడీలు తక్కువగా ఉంటాయని, అయినా కరోనాపై పోరులో సిడి 8 టి కణాలు వీరికి అవసరం అవుతాయని స్పష్టం చేశారు. అధిక స్థాయిలో ఈ కణాలు కలిగిన క్యాన్సర్ రోగులు కొవిడ్ నుంచి కోలుకోడానికి మూడున్నర రెట్లు ఎక్కువ అవకాశం ఉందన్నారు. కరోనా బారిన పడిన క్యాన్సర్ రోగులకు చికిత్సను మెరుగుపర్చడంలో ఇవి చాలా కీలకమని చెప్పారు.

రోగ నిరోధక వ్యవస్థ లోని ఒక విభాగం కుదేలైనప్పుడు మిగతా విభాగాలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కొవిడ్ నుంచి రక్షణ కోసం ఇస్తున్న ఎంఆర్‌ఎన్‌ఎ టీకాల వల్ల్ల రోగ నిరోధక వ్యవస్థలో యాంటీబాడీలు, టి కణాల పరంగా స్పందన ఉత్పన్నమవుతుందని వివరించారు. అందువల్ల క్యాన్సర్ బాధితులకు వ్యాక్సిన్లు ఇచ్చినప్పుడు యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోయినప్పటికీ టి కణ రోగనిరోధక వ్యవస్థ ద్వారా రక్షణ లభించ వచ్చని వెల్లడైనట్టు చెప్పారు. ఇతరత్రా క్యాన్సర్లు ఉన్న వారితో పోలిస్తే బ్లడ్ క్యాన్సర్ బాధితులు కరోనాతో మరణించే ప్రమాదం ఎక్కువని కూడా వెల్లడైందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News