Wednesday, May 22, 2024

సెప్టెంబర్‌లో హుజురాబాద్ ఉప ఎన్నిక..?

- Advertisement -
- Advertisement -

Huzurabad by-election in September?

 

మనతెలంగాణ/హైదరాబాద్ : హుజురాబాద్ ఉప ఎన్నిక సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు ఈ మేరకు సంకేతాలు అందినట్లు సమాచారం. కరోనా ఉధృతి నేపథ్యంలో సెప్టెంబర్‌లోగా 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారుల టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఎన్నికల సిబ్బందికి ముందే వ్యాక్సినేషన్ పూర్తి చేసి, ఓటర్లు, నేతలకు విస్తృతంగా వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎంఎల్‌ఎగా గెలిచిన ఈటల రాజేందర్ ఇటీవల రాజీనామా చేయగా, శాసనసభ స్పీకర్ కూడా ఆయన రాజీనామాను ఆమోదించారు. దీంతో హుజురాబాద్‌లో ఎన్నికలు అనివార్యమైంది.

దాంతో ఇప్పటి నుంచే ఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే హుజురాబాద్ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేసోతంది. ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు టిఆర్‌ఎస్ నేతలు అందరూ హుజురాబాద్ టిఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగిరేలా టిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం నాయకులు, కార్యకర్తలను దిశానిర్ధేశం చేస్తోంది. ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పర్యటిస్తుండగా, కాంగ్రెస్ నేతలు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News