Tuesday, April 30, 2024

బాలానగర్ ఫ్లైఓవర్ పై ప్రమాదం.. యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

Youngster died in Road Accident at Balanagar Flyover

హైదరాబాద్: నగరంలో ఇటీవల ప్రారంభమైన బాలానగర్ ఫ్లైఓవర్ కింద ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బైక్ పై అతివేగంగా వెళ్లి ఫ్లై ఓవర్ పై డివైడర్ ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఎపిలోని ప్రకాశం జిల్లా కొనిదెలకు చెందిన అశోక్ గా పోలీసులు గుర్తించారు.

Youngster died in Road Accident at Balanagar Flyover

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News