Tuesday, May 21, 2024

ప్రమాదవశాత్తు మెడిప్యాక్ కంపెనీలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

fire accident in medipack company

కుత్బుల్లాపూర్ : ప్రమాదవశాత్తు దుండిగల్‌లోని మెడిప్యాక్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దుండిగల్‌లోని మెదిప్యాక్ ఇంటర్నేషనల్ కంపెనీలో అల్యూమినియం ఫాయిల్ ప్రింటింగ్ యూనిట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో దట్టమైన పోగలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, దుండిగల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులొకి తెచ్చారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

fire accident in medipack company

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News