Monday, April 29, 2024

మళ్లీ మొదలుపెట్టిన సలార్

- Advertisement -
- Advertisement -

Prabhas act in salar movie

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. ‘ది మోస్ట్ వైలెంట్ మ్యాన్…’ అంటూ ప్రభాస్‌ను సరికొత్త అవతారంలో చూపించి ప్రశాంత్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందులో డార్లింగ్ ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడని హింట్ ఇచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిపోయిన ‘సలార్’ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్‌ను సోమవారం హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ షూటింగ్‌లో సోమవారం అర్థరాత్రి ఒంటి గంట వరకు పాల్గొన్నట్లు హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లో ఆగస్టు 8 నుంచి ప్రభాస్ పాల్గొనే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చేయనున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్ లోపు ‘సలార్’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడని టాక్. కాగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘సలార్‌” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. 2022 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News