Wednesday, May 22, 2024

బిజెపి దళిత వ్యతిరేక పార్టీ: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

BJP is an anti-Dalit party

హుజూరాబాద్: బిజెపి దళిత వ్యతిరేక పార్టీ అని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్‌లు దళితులను ఓటర్లుగానే చూశారుగాని మనుషులుగా చూడలేదని మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బాల్కసుమన్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు దళితుల కోసం పని చేయలేదన్నారు. మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తున్న ఏకైక సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. దళితుల కోసం పని చేస్తున్న నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు. దళితుల్లో ఆత్మవిశ్వాసం నింపడంతో పాటు వెనకబాటుతనం లేకుండా చేయాలని కెసిఆర్ ఆలోచన మేరకు దళిత బంధు వచ్చిందన్నారు. ఇతర వర్గాలతో సమానంగా దళితులు సగర్వంగా తల ఎత్తుకొని తిరగాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News