Monday, April 29, 2024

తగ్గిన వ్యాక్సిన్ సెంటర్లు

- Advertisement -
- Advertisement -

Covid Vaccine Centers in Hyderabad reduced

టీకా కోసం పలు కేంద్రాలు తిరుగుతున్న స్దానికులు స్థానికులు
ఎక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలో అర్థం కాక సమస్యలు
టీకా నిల్వలు తగ్గడంతో కేంద్రాలు తగ్గించిన వైద్యశాఖ
సెంటర్ల వద్ద గుంపులుగా చేరడంతో థర్డ్‌వేవ్ తప్పదంటున్న వైద్యులు

హైదరాబాద్: నగరంలో కరోనా సెకండ్ డోసు కోసం ప్రజలు వ్యాక్సిన్ సెంటర్లు వద్ద బారులు తీరుతున్నారు. టీకా తీసుకోవాల్సిన గడువు దాటిపోవడంతో ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు సకాలంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు అవస్దలు పడుతున్నారు. సమీపంలో వైద్యశాఖ ఏర్పాటు చేసి ఆరోగ్య కేంద్రాలకు వెళ్లుతుండంతో అక్కడ టోకెన్లు ఇచ్చి వరుస క్రమం రాగానే వచ్చి టీకా తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచించడంతో మూడు నాలుగు రోజులకు టీకా లభిస్తుంది. నగరంలో వ్యాక్సిన్ పంపిణీ చేసే కేంద్రాలు తగ్గించడంతో ఇతర కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలంటే ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటివరకు 110 టీకా సెంటర్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 82 కేంద్రాల్లో సెకండ్ డోసు వేస్తున్నట్లు, వ్యాక్సిన్ నిల్వలు సరిపడ లేకపోవడంతో ఉన్నవాటినే సర్దుబాటు చేస్తున్నట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు. గ్రేటర్ నగరంలో 59లక్షల మంది మొదటి డోసు తీసుకోగా, సెకండ్ డోసు 15లక్షల మంది తీసుకున్నట్లు, ఇంకా 44లక్షలమంది టీకా పంపిణీ చేయాల్సి ఉంది.

వారి కోసం వైద్యశాఖ అధికారులు కేంద్ర ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ కొరత ఉన్నట్లు, త్వరగా సరఫరా చేయాలని ఇప్పటికే కోరారు. రోజు ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు సమాధానం చెప్పుకోలేక అవస్దలు పడుతున్నారని, కొన్నిచోట్ల ఆరోగ్య కార్యకర్తలను రాజకీయ నాయకులు బెదిరింపులకు గురిచేస్తూ తాము సూచించిన వారిందరికి ఇవ్వాలని పేర్కొనడంతో విధులు నిర్వహించేందుకు వెనకడుగు వేస్తున్నారని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం త్వరగా వ్యాక్సిన్‌ను కేంద్రాలకు తరలించి, మరిన్ని సెంటర్లు పెంచాలని కోరుతున్నారు. బస్తీదవఖానలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ రోగులకు వైద్య చికిత్స అందించలేక పోతున్నారని, కేవలం టీకా సెంటర్లుగా మారాయి. దీంతో విషజ్వరాలు వచ్చే రోగులు గంటల తరబడి వేచిచూసి, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లుతున్నారు. జిల్లా వైద్యాధికారులు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు అన్ని కేంద్రాల్లో టీకా పంపిణీ చేయాలని స్దానిక ప్రజలు కోరుతున్నారు.

టీకా సెంటర్ల వద్ద భారీ క్యూతో వైరస్ విజృంభణ… 

గత వారం రోజుల నుంచి టీకా కేంద్రాల వద్ద జనం బారులు తీసి కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో ఆరోగ్య కేంద్రాల నుంచి థర్డ్‌వేవ్ ప్రారంభమైతుందని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీకా కేంద్రాలకు వచ్చే వారికి ఎప్పటికప్పడు వ్యాక్సిన్ పంపిణీ చేస్తే జనం క్యూ కట్టాల్సి అవసరంలేదని, టీకా కోసం ఒకే దగ్గర రోజు గుంపులుగా చేరడంతో మరోసారి కరోనా ఉగ్రరూపం దాల్చుతుందని పేర్కొంటున్నారు.వైద్యశాఖ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ టీకా పంపిణీ చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News