Tuesday, April 30, 2024

అఫ్ఘాన్‌ను పునర్ నిర్మించిడం మా పని కాదు: అమెరికా

- Advertisement -
- Advertisement -

Under fire over withdrawal of US troops from Afghanistan

న్యూయార్క్: అల్‌ఖైదా ఉగ్రవాదులను నిర్మూలించేందుకు అఫ్ఘనిస్తాన్‌కు తమ సైన్యాన్ని తరలించామని యుఎస్‌ఎ ప్రెసిడెంట్ జో బైడెన్ తెలిపారు. అఫ్ఘనిస్తాన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తాలిబన్లపై పోరాడకుండా అఫ్ఘనిస్తాన్ రాజకీయ నాయకులు పారిపోయారని ఎద్దేవా చేశారు. అఫ్ఘాన్‌ను పునర్ నిర్మించిడం తమ పని కాదన్నారు. విదేశీ గడ్డపై నిరంతరం పోరాటం చేయడం తమ సైన్యం పని కాదన్నారు. అఫ్ఘాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడం సరైన నిర్ణయమేనని సమర్ధించారు. అఫ్ఘాన్‌లో ఏర్పడే ఇబ్బందుల గురించి తెలుసునని, ఊహించిన దానికంటే ఎక్కువగా అక్కడ పరిణామాలు ఉన్నాయని జో బైడెన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అఫ్ఘానిస్థాన్‌లో రూ.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని, మూడ లక్షల మందితో బలమైన సైన్యాన్ని తయారు చేశామని, తాలిబన్లతో రాజకీయ నాయకులు, సైన్యం పోరాడలేక చేతులేత్తేశారన్నారు. తాలిబన్లపై పోరాటం చేసేందేకు అప్ఘాన్ సైన్యానికి ఆసక్తి లేదన్నారు. తాలిబన్లపై యుద్ధం చేయాలని తమ సైన్యానికి ఎలా చెప్పగలం అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News