Tuesday, May 21, 2024

పాము విషంతో కరోనాకు చెక్

- Advertisement -
- Advertisement -

Brazilian viper's venom can stop Covid-19 from multiplying

సావొపౌలో యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధన

సావోపౌలో : బ్రెజిల్ అడవుల్లో కనిపించే విష సర్పం జరారాకుసోకు చెందిన విషంతో కరోనా మమమ్మారిని అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికను సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్‌లో ప్రచురించారు. రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు , కొవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్ధంగా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ సర్పం విష అణువులు కోతుల్లో 75 శాతం కరోనా వైరస్ కణాల వృద్ధిని నియంత్రిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌లో రెట్టింపు అవుతున్న ముఖ్యమైన ప్రొటీన్‌ను అడ్డుకోవడంలో జరారాకు సో సర్పంలో ఉన్న అణువులు బాగా పనిచేస్తున్నట్టు సావోపౌలో యానివర్శిటీ ప్రొఫెసర్‌రాఫేల్ గైడో వివరించారు. బ్రెజిల్‌లో కనిపించే అతి పెద్ద సర్పాల్లో జరారాకుసో ఒకటి. ఆ పాములు రెండు మీటర్ల పొడవు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడవులతోపాటు బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ సర్పాలు సంచరిస్తుంటాయి. ఈ సర్పాల్లోని పెపెటైడ్ అణువులను ప్రయోగశాలల్లో అభివృద్ధి చేయవచ్చునని రాఫేల్ గైడో చెప్పారు. శాస్త్రవేత్తలు ఇంకా ఈ అధ్యయనం లోనే ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News