- Advertisement -
లెహ్: తమ రాష్ట్ర జంతువుగా మంచు చిరుతను(స్నో లెపర్డ్), రాష్ట్ర పక్షిగా నలుపు రంగు మెడ గల కొంగను లడఖ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అడవులు, జీవావరణ, పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పవన్ కొత్వాల్ ఒక నోటిఫికేషన్లో తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌కు రాష్ట్ర జంతువుగా మంచు చిరుత(పాంథర్ యునిక), రాష్ట్ర పక్షిగా నల్లమెడ కొంగ(గ్రస్ నిక్రికొల్లిస్)ను లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించినట్లు కొత్వాల్ తెలిపారు. మంగళవారం నుంచి ఇది అమలులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.
Snow leopard is new state animal of Ladakh
- Advertisement -