Tuesday, April 30, 2024

ఎదురులేని ‘రిషబ్ సేన’

- Advertisement -
- Advertisement -

Delhi beat Chennai Super Kings by three wickets

 

రాణించిన బౌలర్లు
ఆదుకున్న ధావన్, హెట్‌మెయిర్
చెన్నైపై ఢిల్లీ విజయం

దుబాయి: ఐపిఎల్ సీజన్ 14లో ఢిల్లీ క్యాపిటల్స్ విజ యపరంపర కొనసాగుతోం ది. సోమవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ మూడు వికెట్ల తేడా తో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ సీజన్‌లో రిషబ్ సేనకు ఇది పదో విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టాని కి 136 పరుగులు చేసింది. తర్వా త బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యా న్ని ఛేదించింది. సునాయాస లక్షం తో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషాలు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. పృథ్వీషా తన మార్క్ షాట్లతో చెలరేగా డు. ధావన్ మాత్రం సమన్వయంతో బ్యాటింగ్ చేశా డు. 12 బంతుల్లో మూడు ఫోర్లతో 18 పరుగులు చేసి జోరు మీద కనిపించిన పృథ్వీషాను దీపక్ చాహర్ వెనక్కి పంపాడు. దీంతో ఢిల్లీ 24 పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ధావన్ తనపై వేసుకున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ (2) మరోసారి నిరాశ పరిచాడు.

తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు రిపాల్ పటేల్ రెండు ఫోర్లతో 18 పరుగులు చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన శిఖర్ ధావన్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ 99 పరుగులకే ఆరు వికె ట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో హెట్‌మెయిర్ అద్భుత బ్యాటిం గ్‌తో ఢిల్లీని ఆదుకున్నాడు. చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేసిన హెట్‌మెయి ర్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

రాయుడు ఒంటరి పోరాటం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఢిల్లీ బౌలర్లు సఫలమయ్యారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (13), డుప్లెసిస్ (10) ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. వన్‌డౌన్‌లో వచ్చిన రాబిన్ ఉతప్ప (19) కూడా నిరాశ పరిచాడు. మోయిన్ అలీ (5) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. దీంతో చెన్నై 62 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అంబటి రాయుడు, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిలు ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను తమపై వేసుకున్నారు. ఒంటరి పోరాటం చేసిన రాయుడు 43 బంతుల్లో రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోని 18 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో అక్షర్, అశ్విన్, రబడా పొదుపుగా బౌలింగ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News