Monday, May 13, 2024

కొవిడ్ విధుల్లో ఉండే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.50 లక్షల బీమా వర్తింపు

- Advertisement -
- Advertisement -

Rs 50 lakh insurance cover for Anganwadi workers in Covid duties

న్యూఢిల్లీ: కొవిడ్19 సంబంధిత కార్యకలాపాల్లో పాలు పంచుకునే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రూ.50 లక్షల బీమా వర్తిస్తుందని సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం చెప్పారు. కరోనా అగాహనా కార్యక్రమాలు, సర్వే కార్యక్రమాలు, ఇంటింటికీ తిరిగి రేషన్ పంపిణీ చేయడం లాంటి కార్యకలాపాలు నిర్వహించే అంగన్‌వాడి వర్కర్లు, హెల్పర్లకుఈ పథకం కిందికి వస్తారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అలాంటి వారికి 2020 మార్చి 11నుంచి ఇప్పటివరకు మొత్త కాలానికి ప్రధానమంత్రి గరబ్ కళ్యాణ్ యోజన కింద రూ.50 లక్షల బీమా వర్తిస్తుందని ఆ అధికారి చెప్పారు. కొవిడ్ 19 కారణంగా మృతి, సంబంధిత విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఈ ప్యాకేజి వర్తిస్తుంది.

దేశవ్యాప్తంగా దాదాపు 13.29 లక్షల మంది అంగన్‌వాడి వర్కర్లు, 11.79 లక్షల మంది హెల్పర్లు ఉన్నారు. కొవిడ్19 సంబంధిత కార్యకలాపాలు, విధుల్లో పాలు పంచుకొంటున్న అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్లును గుర్తించాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాలను కోరడం జరిగిందని ఆ అధికారి చెప్పారు. ఈ మేరకు రాష్ట్రాలకు సమాచారం ఇవ్వడం జరిగిందని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాటిపై ఉందని ఆ అధికారి చెప్తూ, ఈ ప్యాకేజి కింద రాష్ట్రాలకు కేంద్రంనుంచి మద్దతు లభించేలా చూస్తామని కూడా చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News