Monday, May 6, 2024

టి20 వరల్డ్‌కప్‌ నుంచి బ్యాట్స్‌మన్‌కు బదులుగా బ్యాటర్

- Advertisement -
- Advertisement -
ICC to use word 'Batter' instead of 'Batsman
ఐసిసి నిర్ణయం

దుబాయి: క్రికెట్‌లో లింగ వివక్షకు తావు లేకుండా ఉండడానికంటూ గత నెలలో బాట్స్‌మన్ అనే పదాన్ని బ్యాటర్‌గా మార్చాలపి మెరిలిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసిసి) గత నెల సూచించిన విషయం తెలిసిందే. ఈ మార్పును టి20 ప్రపంచకప్‌నుంచి అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి ( ఐసిసి) నిర్ణయించింది.ఆ తర్వాతినుంచి అన్ని టోర్నీల్లోను ఇదే రూల్ వర్తించనుంది. బ్యాట్స్‌మన్‌ను బ్యాటర్‌గా మార్చాలన్న ఎంసిసి నిర్ణయాన్ని అందరూ స్వాగతించారని ఐసిసి తాత్కాలిక సిఇఓ జెఫ్ అలార్డిస్ అన్నారు. ‘ ఇప్పటికే కామెంట్రీలో, ఇతర చానెళ్లలో బ్యాటర్ అనే పదాన్ని వాడుతున్నాం. ఇప్పుడు ఎంసిసి దానిని క్రికెట్ చట్టాల్లో భాగం చేయాలని నిర్ణయించడం స్వాగతించదగ్గదే. దానిని మేము అనుసరిస్తాం’ అని అలార్డిస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకనుంచి బౌలర్స్, ఫీల్డర్స్, వికెట్ కీపర్స్‌లాగే బ్యాటర్స్‌లోను లింగభేదం ఉండదన్నారు. ఇది చాలా రోజులుగా అనుకొంటున్న మార్పు అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News