Wednesday, May 15, 2024

ఏ పార్లమెంటులోనైనా ఇతర దేశాల వ్యవహారాలు చర్చించరాదు : స్పీకర్ బిర్లా

- Advertisement -
- Advertisement -

Om Birla at G20 Parliamentary Speakers Summit

న్యూఢిల్లీ : ఏదేశ పార్లమెంటయినా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలను కానీ, అంతర్జాతీయ వ్యవహారాలను కానీ ప్రస్తావించరాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా గురువారం స్పష్టం చేశారు. రోమ్‌లో జరుగుతున్న జి 20 దేశాల పార్లమెంట్ స్పీకర్ల సదస్సుకు సంబంధించి భారత పార్లమెంట్ ప్రతినిధుల బృందానికి బిర్లా నాయకత్వం వహిస్తున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సేహొయిలే తో బిర్లా గురువారం దైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటన ప్రకారం బిర్లా పై విధంగా సూచించారు. ప్రతిదేశానికి తన సార్వభౌమత్వం ఉంటుందని దాన్ని ఇతర దేశాలు గౌరవించాల్సిందేనని ఆయన సూచించారు. పార్లమెంటరీ దౌత్య విధానం ద్వారా ఉభయదేశాల పార్లమెంటేరియన్లు తమ అభిప్రాయాలను పరస్పరం వ్యక్తం చేసుకోడానికి నేతలిద్దరూ అంగీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News