Tuesday, April 30, 2024

రిక్షా కార్మికుడికి ఆదాయపు పన్ను నోటీసు?

- Advertisement -
- Advertisement -
Ricksha puller gets IT Notice
పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

మథుర: ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లాకు చెందిన రిక్షా కార్మికుడు రూ. 3కోట్లు కట్టమని ఆదాయపు పన్ను నోటీసు రావడంతో ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే…మథుర జిల్లాలోని బకల్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రతాప్ సింగ్‌ది పేద కుటుంబం. రిక్షానడిపితే కానీ డొక్కాడని పరిస్థితి. రిక్షా నడపగా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని బ్యాంకులో పొదుపు చేసుకుంటుంటాడు. అయితే తన ఖాతాకు పాన్ కార్డును అనుసంధానం చేయాలని బ్యాంకు అధికారులు చెప్పడంతో 2021 మార్చి 15న పాన్ కార్డును అనుసంధానం చేయడానికి స్థానిక జన్ సువిధా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సంజయ్ సింగ్ అనే ఓ వ్యక్తి ప్రతాప్‌కు పాన్‌కార్డ్ కలర్ జిరాక్ట్ కాపీ ఇచ్చాడు. అయితే చదువుసంధ్యలులేని అతడు దానిని నకిలీ కార్డుగా గుర్తించలేకపోయాడు. కాగా అక్టోబర్ 19న ఐటి అధికారుల నుంచి ప్రతాప్ సింగ్‌కు ఫోన్ వచ్చింది. రూ. 3.47 కోట్ల పన్ను చెల్లించాలని నోటీసు కూడా జారీ చేశారు. దీనికి అతడు ఖంగుతిన్నాడు. తాను కేవలం రిక్షా కార్మికుడినని వారికి చెప్పాడు. దాంతో ఆ అధికారులు కూడా ఆశర్యపోయారు.

ఎవరో ప్రతాప్ సింగ్ పేరిట జిఎస్‌టి తీసుకుని వ్యాపారం చేస్తున్నారని, 2018-19లో ఆ కంపెనీ టర్నోవర్ రూ. 43 కోట్లుగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంపై ఐటి అధికారుల సలహా మేరకు ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News