Home తాజా వార్తలు అన్నను గొంతుకోసిన తమ్ముడు….

అన్నను గొంతుకోసిన తమ్ముడు….

Younger brother cut to throat of elder brother

నిజామాబాద్: అన్నదమ్ముల మధ్య గొడవ అన్న ప్రాణాల మీదికి తెచ్చిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్ధిపూర్ గ్రామంలో షేక్ మతిన్- ఫాయాజ్ అనే అన్నదమ్ముడు నివసిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు మధ్య గొడవ జరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఫాయాజ్ కత్తితో అన్న గొంతు కోశాడు. వెంటనే మతిన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఎటువంటి సమాచారం అందలేని ఎస్‌ఐ అంజనేయులు పేర్కొన్నారు.