Tuesday, April 30, 2024

వనపర్తి ఎస్ఐ రాసలీలలు…. సస్పెండ్

- Advertisement -
- Advertisement -

వివాహితతో ఎస్ఐ రాసలీలలు
భర్తలేని సమయంలో ఇంటికొచ్చి కామక్రీడలు
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన భర్త

Sub Inspector marital affair with Women

వనపర్తి: ఓ మహిళతో ఎస్ఐ వివాహతేర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండడ్ దొరకడంతో అతడిని చితకబాదిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షేక్ షఫీ అనే వ్యక్తి వనపర్తి రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ… భర్తలేని సమయంలో ఆమె ఇంట్లోనే ఎస్ఐ కామ క్రీడలు కొనసాగిస్తున్నాడు. స్థానికులు, స్నేహితుల సహాయంతో భర్త ఈ విషయం తెలుసుకున్నాడు. వెంటనే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు పట్టుకోవాలని ప్లాన్ వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నానని భార్యకు చెప్పి దగ్గరలో భర్త కాపు కాశాడు. వెంటనే ఆమె ఎస్ఐకి ఫోన్ చేసి ఇంటికి రావాలని సమాచారం ఇచ్చింది. దీంతో ఎస్ఐ వెంటనే ప్రియురాలి ఇంట్లోకి వెళ్లి గడియవేసుకున్నాడు. ఇద్దరు శృంగారంలో ఉండగా భర్త, అతడి స్నేహితులు వాళ్లను పట్టుకున్నారు. ఆవేశంలో ఊగిపోయిన భర్త, ఎస్ఐతో పాటు భార్యను చితకబాదాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన ఎస్ఐని వనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారులు ఈ ఘటనను సీరియస్ తీసుకొని సదరు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News