Tuesday, April 30, 2024

ఛాలెంజ్‌గా తీసుకొని ‘స్కైలాబ్’ చేశా

- Advertisement -
- Advertisement -

Sky lab movie in Tollywood

 

సత్యదేవ్, నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ ప్రధా న తారాగణంగా డా.రవికిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వ క్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన చిత్రం ‘స్కైలాబ్’. నిత్యామీనన్ సహ నిర్మాతగా 1979లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ చిత్రం ఈనెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మీడియాతో మాట్లాడుతూ “ఈ చిత్రం లో నా క్యారెక్టర్ ఫన్నీగా ఉంటుంది. స్కైలాబ్ పడిపోతున్నప్పుడు దాన్ని ఉపయోగించుకొని డబ్బు లు సంపాదించాలనుకునే ఆనంద్ అనే డాక్టర్ చివర కు ఎలా మారిపోతాడనేది ఆసక్తికరంగా ఉంటు ంది. ఈ చిత్రంలో నాకు, నిత్యామీనన్‌కు ఆన్‌స్క్రీన్ ఒక సీన్ కూడా ఉండదు. అయితే అన్ని పాత్రలకు ఓ కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. ఈ సినిమాలో నా లుక్ విషయంలో దర్శకుడు విశ్వక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. గడ్డం మీసాలు తీసేసి నటించాను. నా పాత్రను ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సిని మా చేశాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News