Tuesday, May 21, 2024

ఇళయరాజాతో చేస్తానని కలలో కూడా అనుకోలేదు

- Advertisement -
- Advertisement -


సంజనా రావు దర్శకత్వంలో శ్రియా శరణ్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గమనం’. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సం యుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఈనెల 10న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా హీరో శివ కందుకూరి మీడియాతో మాట్లాడుతూ “గమనం సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా అవుతుంది. చారు హాసన్ వంటి సీనియర్స్‌తో నటించే అవకాశం రావడం ఎంతో అదృష్ణం. ఆయనతో నాకు వర్షంలో ఓ సీన్ ఉంటుంది. నాతో పాటు ఎన్నో గంటలు ఆయన అలా నిల్చొని ఉన్నారు. ఇళయరాజాతో పని చేసే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ప్రస్తుతం నేను ‘మనుచరిత్ర’ చేస్తున్నాను. నాని ప్రొడక్షన్‌లో ‘మీట్ క్యూట్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాను. మరో రెండు సినిమాలకు సైన్ చేశాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News