మన తెలంగాణ /ఘట్‌కేసర్: విచ్చలవిడి అవినీతికి పరాకాష్ట అయిన కేసిఆర్ కుటుంబాన్ని, అంతకన్నా పదిరేట్లు అసమర్థుడు రేవంత్ రెడ్డి పాలన చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజేపి ప్రత్యామ్నయంగా భావిస్తున్నారని, రానున్నది బిజేపి ప్రభుత్వమేనని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధి అవుషాపూర్‌లోని బిజేపి పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్‌చార్జీ ఏనుగు సుదర్శణ్ రడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సుదర్శన్ రెడ్డితో కలసి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసిఆర్ సొంత కొడుకు కేటిఆర్ అయితే దత్త పుత్రుడు రేవంత్ రెడ్డి అని, కాళేశ్వరం విచారణ కమిటీ ఇచ్చిన పూర్తి నివేధికను ప్రజల మద్య పెట్టాలని, అందులో పది పేజీలు తెచ్చి ప్రజలను మోసం చేయాలనుకోవడం మానుకోవాలని అన్నారు.
కాళేశ్వరం పిసీ ఘోష్ కమిషన్ నివేధికలో కేసిఆర్ పాలనలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసి, పెద్ద ఎత్తున అప్పులకు ఆద్యుడైన ఐఎఎస్ అధికారి రామ కృష్ణరావును, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే తరహా అప్పులు తేవడానికి ముఖ్య కార్యదర్శిగా నియమితులైన కృష్ణరావును నివేధికలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలనలో తప్పులను ప్రశ్నిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తెలంగాణ బడుగుల ముద్దు బిడ్డ, తెలంగాణ ఉద్యమ కారుడు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్‌పై బట్టకాల్చి వేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రభుత్వమైన నిర్ణయాలు మంత్రి వర్గం ఉమ్మడి బాధ్యతగా ఉంటాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) స్పష్టం చేస్తుందని గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘానికి నాటి కేసిఆర్ పాలనలో, నేటి రేవంత్ రెడ్డి పాలనలో మంత్రిగా కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులేనని, తుమ్మలను కమిటీ విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.
ఆర్థిక అవకతవకలకు ఈటల రాజేందర్‌ను బాధ్యులుగా చేయడం సరికాదని, గతంలో పిసిసి అధ్యక్షుడిగా కేసిఆర్‌పై చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిరూపించలేక డైలీ సీరియల్‌గా ఎదో ఒక అంశాన్ని తెరపైకీ తిసుక వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజేపి సీనియర్ నాయకులు కాలేరు రామోజి, మాజీ ఎంపిటీసి ఏనుగు లకా్ష్మరెడ్డి, ఘట్‌కేసర్ మున్సిపాలిటీ బిజేపి పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్, జిల్లా నాయకులు కృష్ణ గౌడ్, మల్లిఖార్జున్, జైపాల్ రెడ్డి, రమేష్ నాయుడు, సత్యనారాయణ, ఏనుగు మచ్చేందర్ రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.