- Advertisement -
మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి ః దాదాపుగా రూ.లు 60 లక్షల వరకు సైబర్ నేరానికి పాల్పడిన ముల్లుంటి సలీం మాలిక్(32)ను అరెస్ట్ చేసినట్లు బుధవారం డిఎస్‌పి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. బాధితులకు ఆరోగ్యశాఖ నుండి మాట్లాడుతున్నట్లు నమ్మించి వారికి హస్పిటల్ ఖర్చులు రిఫండ్ చేయిస్తామని బాధితులకు ఒక లింక్ పంపి దాన్ని ఓపెన్ చేసి అందులో యుపిఐ పిన్ ఎంటర్ చేయడంతో బాధితులు డబ్బు కోల్పోయారన్నారు. నిందితుడు సుమారుగా రూ.లు 60 లక్షల వరకు మోసగించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడు ముల్లుంటి సలీంమాలిక్‌కు సహకరించిన సతీష్ అనే వ్యక్తి ఫరారీలో ఉన్నాడని డిఎస్‌పి తెలిపారు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.
- Advertisement -