- Advertisement -
మన తెలంగాణ/ సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమకుల గ్రామానికి చెందిన వార్దోల్ శ్రీకాంత్ యాదవ్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద తనకు ఇల్లు మంజూరు కాకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మ యత్నానికి పాల్పడ్డాడు. గ్రామంలోని బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ, శ్రీకాంత్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా, కొంత తాగడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు వెంటనే స్పందించి అతన్ని నిలువరించారు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. శ్రీకాంత్ యాదవ్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -