Thursday, August 7, 2025

ప్రత్యర్థులుగా మారిన స్నేహితుల కథ.. ‘మయసభ’ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

ఆది పినిశెట్టి, చైతన్య రావులు ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘మయసభ’ (Mayasabha).తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరిగిన కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. ప్రాణ స్నేహితులుగా ఉండే ఇద్దరు కొన్ని కారణాల వల్ల ప్రత్యర్థులుగా ఎలా మారారు అనేదే ఈ సిరీస్ కథ. దేవా కట్టా, కిరణ్ జై కుమార్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఇప్పటికే వచ్చిన ఈ సిరీస్ ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

జీవితంలో ఏదో సాధించాలని.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మేలు చేయాలని భావించే ఇద్దరి వ్యక్తుల జీవితాలు రాజకీయాల్లోకి వచ్చాక ఏలా మారాయో ఈ సిరీస్ (Mayasabha) చూస్తే తెలుస్తుంది. చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారే.. రాజకీయ గమనంలో ప్రత్యర్థులుగా ఎలా మారారు అనేది మూల అంశం. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను నిర్మించారు.

ఈ సిరీస్‌లో కాకర్ల కృష్ణమ నాయుడు పాత్రలో ఆది పినిశెట్టి, ఎం.ఎస్.రామిరెడ్డి పాత్రలో చైతన్య రావులు నటించగా.. ఐరావతి బసు పాత్రలో దివ్య దత్తా నటించారు. ఈ సిరీస్ గురువారం (ఆగస్టు 7)న విడుదలైంది. ప్రముఖ ఒటిటి సంస్థ సోనీ లివ్‌లో ఇది ప్రసారం అవుతోంది. ఈ మొత్తం తొమ్మిది ఎపిపోడ్లుగా వచ్చింది. కొన్ని ఎపిసోడ్లు 30 నిమిషాల, మరికొన్ని ఎపిసోడ్లు 50 నిమిషాలకు పైగా స్ట్రీమ్ అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News