అమరావతి: పులివెందులలో జడ్‌పి ఎన్నికల సందర్భంగా తనని మళ్లీ బెదిరించాలని చూస్తున్నారని సునీత తెలిపారు. పులివెందులలో వివేకా ఘాట్ వద్ద సునీత దంపతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. హింసలేని పులివెందులను ప్రజలు చూడాలనుకుంటున్నారన్నారు. మాజీ ఎంపి వివేకా హత్య జరిగిన రోజు మాజీ ఎంపి అవినాష్ తన దగ్గరికి వచ్చి ముగ్గురు పేర్లు ఆదినారాయణరెడ్డి, సతీశ్‌రెడ్డి, బిటెక్ రవి చంపినట్లు సంతకం చేయమంటే తాను చేయలేదని, పోలీసులను బెదిరించి సాక్ష్యాధారాలను తుడిపేశారని దుయ్యబట్టారు. గొడ్డలిపోటుతో వివేకా పడి ఉంటే అప్పుడు గుండెపోటు అని చెప్పారని, గతంలో టిడిపి నేతలు చంపారని నమ్మబలికారన్నారు. నాన్న హత్య కేసులో నిందితులు యథేచ్చగా బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాల నుంచి కోర్టు చుట్టు తిరుగుతున్నానని, వాయిదాలతో నిందితులతో పాటు తాను కూడా కోర్టుకు హాజరవుతున్నానని, శిక్ష నిందితులకా? తనకా అని ప్రశ్నించారు. ఇంకా ఎన్ని రోజులు న్యాయం పోరాటం చేయాలని అడిగారు. సిబిఐ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు తెలిపిందని, విచారణ సరిగా లేదని సుప్రీంకోర్టు పిటిషన్ వేశానని, కానీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని సునీత పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పోలీస్ స్టేషన్లు, కోర్టులలో న్యాయం జరగలేదన్నారు. తప్పు చేసిన వారు జైలులో ఉంటే ఇలాంటివి మళ్లీ జరగవన్నారు.
వివేక్ హత్య… శిక్ష నిందితులకా? నాకా?: సునీత
- Advertisement -
- Advertisement -
- Advertisement -