Thursday, September 25, 2025

‘ది ప్యారడైజ్‌’ నుంచి అప్‌డేట్.. నాని క్యారెక్టర్ పేరు రివీల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రస్తుతం వరుస సినిమాల సక్సెస్‌తో దూసుకుపోతున్నారు నాచురల్ స్టార్ నాని. ఈ ఏడాది ఇప్పటికే ‘హిట్-3’ చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘దసరా’ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమా టైటిల్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్‌కే అభిమానులకు గూస్‌బంప్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో నాని క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు.

ఈ సినిమాలో (The Paradise) నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాని డిఫరెంట్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘ఇది ఒక అల్లికగా ప్రారంభమై.. విప్లవంగా ముగిసింది’ అంటూ పోస్టర్‌కి క్యాప్షన్ ఇచ్చారు. ఈ జడల లుక్ వెనుక తన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉందని దర్శకుడు వెల్లడించారు. తన తల్లి తనకు చిన్నతనంలో అలాగే జడలు అల్లేదని.. ఐదో తరగతి వరకూ అలా జడలతోనే స్కూ‌ల్‌కు వెళ్లేవాడినని శ్రీకాంత్ ఓదెల గతంలోనే తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీతో పాటు మొత్తం ఎనిమిది భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News