Saturday, August 9, 2025

సొంత బిడ్డ, అల్లుడిని వదలలేదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ తన సొంత కూతురు క విత, అల్లుడు, అలాగే మేనల్లుడు హరీష్ రావు ఫో న్లన్లు సైతం ట్యాపింగ్ చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ పేపర్ల లీక్ కేసు పై విచారణ జరిపిన జడ్జి ఫోను కూడా ట్యాప్ చేసారని అ న్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు శుక్రవారం దిల్‌కుషా ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన విచారణకు బండి సంజయ్ హాజరైయ్యా రు. సిట్ అధికారులు దేవేందర్, వెంకటగిరిలు రెం డు గంటల పాటు ఆయన్ను విచారించారు. విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మా ట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. గత ప్రభుత్వంమొత్తం 6500 ఫోన్లు ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు విచారణ సందర్భంగా చెబితే ఆశ్చర్యపోయానని అన్నా రు. అందులో అందరి కంటే ఎక్కువగా ఫోన్ ట్యా పింగ్ బాధితుడిని తానేనని  బండి సంజయ్ వాపోయారు. తన ఫోనే కాకుండా తన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సహాయకులు, గన్‌మెన్‌లు, డ్రైవర్లు, ఇంట్లో పని చేసేవారి ఫోన్లు ట్యాప్‌కు గురైయ్యాని తెలిపారు. సిట్ అధికారులు తనకు చూపించిన ఆధారాలు చూసి ఆశ్చర్యానికి గురైయ్యానని, మావోయిస్టులు పేరుతో తన ఫోన్ ట్యాప్ చేయడం హాస్యాస్పదమన్నారు.

ఫోన్ ట్యాప్ అయిన నెంబర్లలో ప్రస్తుత సిఎం రేంవత్ రెడ్డి, కెసిఆర్ బిడ్డ కవిత, అల్లుడు హరీష్ రావు కూడా ఉన్నారన్నారు. ఒక్క కెసిఆర్, కెటిఆర్, ఎంపి సంతోష్ ఈ ముగ్గురి ఫోన్లు మాత్రమే ట్యాప్ కాలేదు, చివరకు వారి పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్లు కూడా చేసారన్నారు. ఈ సంగతి తెలిసే హరీష్ రావు ఏడాది పాటు ఫోన్ వాడలేదని తెలిసిందన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎవరూ సాధారణ ఫోన్ కాల్స్ మాట్లడకోలేదని, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుకున్నారని బండి సంజయ్ గుర్తు చేసారు. తెలంగాణ సెంటిమెంట్‌తో గద్దెనెక్కి ప్రజలను కేసీఆర్ ఈవిధమైన ఇబ్బందులకు గురుచేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ప్రజా సమస్యలపైన ధర్నాను చేసేందుకు సిద్దమౌతుంటే పోలీసులు తన ఇంటికి వచ్చేవారని, తన కార్యకలాపాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకునే వారన్నది తనకు ఆ తర్వాత అర్దమైందన్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజి పై ధర్నా చేయడానికి వెళ్తుంటే పోలీసులు తనను అరెస్ట్ చేశారని, తమ కార్యకర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసి అక్రమ కేసులు బనాయించి మానసిక క్షభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్‌ఐబి అనేది మావోయిస్టులు, ఉగ్రవాదుల కార్యాకలాపాలపై నిఘా కోసం ఏర్పాటు చేయగా, దానిని అడ్డం పెట్టుకుని వారితో సంబంధం లేని వేలాది మంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆయన మండిపడ్డారు. ఎస్‌ఐబిని సొంత పనులకు అడ్డాగా మార్చుకున్నారని, వ్యాపారుస్థుల ఫోన్లపై నిఘా పెట్టి డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. భర్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్ కాల్స్ కూడా విన్నారని, ఇది అత్యంత నీచమైన చర్య అని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావుకు ఎస్‌ఐబి చీఫ్‌గా ఉండే అర్హతలేదని, పదవీ విరమణ చేసిన వ్యక్తిని ఎస్‌ఐబి చీఫ్‌గా ఎలా నియమించారని హోం శాఖ అడిగితే ఐజి అని కెసిఆర్ ప్రభుత్వం అబద్దం చెప్పిందని అన్నారు. మావోయిస్టులు, ఉగ్రవాదుల కార్యకలాపాలకు చెందిన రహస్య విషయాలు ఎస్‌ఐబి దగ్గర ఉంటాయని అటువంటి విభాగానికి ప్రభాకర్ రావును నియమించి కెసిఆర్, కెటిఆర్ ఎస్‌ఐబిని సొంత పనులకు వాడుకున్నారని బండి ఆరోపించారు. ట్యాప్ చేసిన డేటా, ఆధారాలు ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలలో ధ్వంసం చేయాలని హోంశాఖ మార్గదర్శకాలను కూడా కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు.

గత అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం ఎంపి అభ్యర్థి వద్ద రూ.7 కోట్ల రూపాయలు పట్టుకున్నారని వాటి వివరాలు ఎమైయ్యాయని సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌తో రూ. 20 కోట్లు పట్టుబడితే రూ.2కోట్లు మాత్రమే లెక్కలోకి చూపారని, మిగతా రూ. 18 కోట్లు నొక్కేసారని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండు ఒకటే అని, కెసిఆర్ చెప్పిందే రేవంత్ రెడ్డి చేస్తున్నారని బండి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో కమిషన్ వేసి కాలయాపన చేస్తోందన్నారు. బిఆర్‌ఎస్‌కు కాళేశ్వరం ఏటిఎంలా మారితే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విచారణలు, కమిషన్లు కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంలాగా మారాయని బండి ఆరోపించారు. కమిషన్ వేయడంతో రాష్ట్రంలో పని అయిపోతుందని, దానికి సంబంధించి ఢీల్లీలో డీల్ తో రేటు కుదిరి అందాల్సిన వారికి డబ్బులు అందుతున్నాయని సంజయ్ ఆరోపించారు.కేవలం కమిషన్లు, విచారణలతోనే సరిపోయిందని, ఏడాదిలో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేయబోమని సిఎం రేవంత్ రెడ్డి ఎలా చెప్తారని, అరెస్ట్ అంశం కోర్టులు,చట్టం పరిధికి సంబంధించినవని తెలిపారు.

విచారణ జరిపించి దోషులపై చర్యలు తీసుకోబోమని ముందే చెబితే, ఆ మాత్రం దానికి కమిషన్‌లు వేయడం ఎందుకని బండి సంజయ్ నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేసారని, మరి సిట్ అధికారులకు ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చి విచారించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. సిట్ అధికారులకు ముఖ్యమంత్రి, జడ్జిలను విచారించే స్థాయి లేదని, అందుకే సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు కేవలం ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించినదే కాదని, ఇందులో ఆర్దిక కుంభ కోణాలు దాగి ఉన్నాయని, సిట్ విచారణతో నిందితులకు శిక్ష పడదని ఆయన స్పష్టం చేసారు. సిబిఐకి కేసు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమ అనుమతి లేకుండా రాష్ట్రంలోకి సిబిఐ రావద్దని జీవో తెచ్చారని, అందుకే సిబిఐ నేరుగా ఈ కేసును విచారించే అవకాశం లేకుండా పోయిందని వివరించారు. సిబిఐ స్వచ్చందంగా కేసు విచారించే అవకాశం ఉంటే కెసిఆర్, కెటిఆర్‌ను ఎప్పుడో జైల్లో వేసేదన్నారు. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News