మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో క్యుములోనింబస్ మేఘాల ఏర్పడ్డాయని తద్వారా రాష్ట్రంలోని దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కు రుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేఘాలతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పాటుగా 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీలలో భారీ వర్షాలు కు రిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే అకాల కుండపోత వర్షానికి క్యుములోనింబస్ మేఘాలే కా రణమని అధికారులు పేర్కొంటున్నారు. సాధారణం గా వేసవిలో అధికంగా వచ్చే క్యుములోనింబస్ మే ఘాలు వానాకాలంలోనే ఏర్పడ్డాయంటే వాతావరణంలో వచ్చిన మార్పులే కారణమని అధికారులు తెలుపుతున్నారు.
క్యుములోనింబస్ మేఘాలు ఎలా ఏర్పడతాయంటే
క్యుములోనింబస్ మేఘాలు సహజంగా తేమ గాలులు, పొడిగాలులు వ్యతిరేక దిశలో వచ్చి ఒకేచోట కలవడం వల్ల ఏర్పడతాయి. సాధారణ మేఘలు సమాంతరంగా వ్యాపిస్తే, క్యుములోనింబస్ మేఘాలు మాత్రం భూమి నుంచి పైకి నిట్టనిలువుగా 18 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడతాయి. ఇవి ఏర్పడితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వస్తాయి. తక్కువ సమయంలో కుంభవర్షం కురుస్తుంది. ఇవి ట్రోపోస్పియర్ దిగువ భాగంలో ఏర్పడతాయి. ఇక్కడ గాలి ప్రవాహాలు పైకి లేస్తాయి, నీటి అవిరి ఘనీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలకు ఈ మేఘాలే కారణమని అధికారులు తెలుపుతున్నారు.
మరో ఐదు రోజులు భారీ వర్ష సూచన
క్యుములోనింబస్ మేఘాల ఏర్పడడంతో రాష్ట్రంలో మరో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.