- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: బిఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు తమతో ‘టచ్’లో ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వ ల బాలరాజు శుక్రవారం తార్నాకలోని రాంచందర్ రావు నివాసానికి వె ళ్ళారు. ఈ సందర్భంగా ఇరువురూ కొంత సేపు మంతనాలు జరిపారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ బాల రాజు ఈ నెల 10న తమ పార్టీలో చేరనున్నారని చెప్పారు. అంతేకాకుండా మరో ఐ దారుగురు మాజీ ఎమ్మెల్యేలూ తమతో టచ్‌లో ఉన్నారని ఆయన తెలిపా రు. బిఆర్‌ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేసుకునే ఆలోచన ఏదీ తమకు లే దన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు ఉంటాయని ఆయన తెలిపా రు. అదేమిటీ? అని ప్రశ్నించగా, ఇంకా చాలా మంది పార్టీలో చేరుతారని ఆయన అన్నారు. వారి పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
- Advertisement -