- Advertisement -
మన తెలంగాణ/కాటారం : తక్షణ ప్రవేశాల కోసం మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆహ్వానం పలికింది. కళాశాలలో ఖాలీగా ఉన్న పాలిటెక్నిక్ సీట్లను ఆగష్టు 11వ తేదీ తక్షణ ప్రవేశాల ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పాసైన విద్యార్థులు, పాలిసెట్ 2025 ఉత్తీర్ణులైన, అనుత్తీర్ణులైనా ప్రవేశ పరీక్ష వ్రాసి సీటు పొందని విద్యార్తులు నేరుగా ఆగష్టు 11వ తేదీన కళాశాలలో అన్ని ధృవపత్రాలతో సంప్రదించి తక్షణమే సీటు పొందవచ్చని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు.
- Advertisement -