Monday, August 11, 2025

బస్సు డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

మెదక్: హవేలీఘన్ పూర్ మండలం శమ్నాపూర్ ప్రాంతం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఒకదానికొకటి పాఠశాల బస్సును, కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. పాఠశాల బస్సును వెనుక నుంచి కారు, అనంతరం అదే బస్సును ద్విచక్ర వాహనం కూడా ఢీకొంది. శమ్నాపూర్ ప్రాంతం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  బస్సు డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులను ప్రమాదం నుండి తప్పించారు. గాయాలయ్యిన ఇద్దరు వ్యక్తులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News