Monday, August 11, 2025

కాంగ్రెస్ హామీలు ఆర్థిక రంగానికి నష్టం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ఆదాయం తగ్గడం ప్రమాద ఘంటికలను మోగిస్తోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) తెలిపారు. కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిందని అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో ఆర్థిక రంగం దెబ్బతింటోందని, ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ హామీ.. ఆర్థిక రంగానికి నష్టం చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం (State revenue) తగ్గుతుంటే.. అప్పులు మాత్రం పెరుగుతున్నాయని, రూ.2,738 కోట్ల మిగులు ఉంటుందని బడ్జెట్ లో చూపారని మండిపడ్డారు. మొదటి త్రైమాసికానికే రూ. 10,583 కోట్ల రెవెన్యూ లోటు ఉందని, మూడు నెలల్లోనే రూ. 20,266 కోట్లు అప్పుగా తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఒక్క రోడ్డు వేయలేదని ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదని అన్నారు. ఆర్థిక రంగాన్ని ఎలా గాడిన పెడతారో కాంగ్రెస్ ఆర్థిక నిపుణులు చెప్పగలరా? అని కెటిఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News