దుబాయ్: ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్ (Team India) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గ్రూప్ స్టేజీలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లోనూ అదే జోరుతో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. పాకిస్థాన్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూండా కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. అర్ష్‌దీప్, హర్షిత్‌ల స్థానంలో బుమ్రా, వరుణ్ జట్టులోకి వచ్చారు. పాకిస్థాన్ కూడా తమ జట్టులో రెండు మార్పులు చేసింది. హసన్ నవాజ్, ఖుష్దిల్ షాలను జట్టు నుంచి తప్పించింది.
తుది జట్లు:
ఇండియా : అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్, సంజు శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి.
పాకిస్థాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలాత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
Also Read : ఆస్ట్రేలియా మహిళలదే సిరీస్